తెలంగాణ

KTR: కాంగ్రెస్‌ ప్రభుత్వం సీరియల్‌ స్నాచర్‌గా వ్యవహరిస్తోంది

KTR: రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వం సీరియల్ స్నాచర్‌గా వ్యవహరిస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్‌తో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులు సమావేశమయ్యారు. వర్సిటీకి చెందిన 50 ఎకరాల భూమిపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై కేటీఆర్‌తో విద్యార్థులు చర్చించారు.

భూములను లాక్కోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదే మొదటిసారి కాదని కేటీఆర్ అన్నారు. రాష్ట్రం ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేతిలో ఉందని తీవ్రంగా విమర్శించారు. ఉర్దూ యూనివర్సిటీలోని భూములపై రేవంత్ కన్నుపడిందని, దానిని కాపాడుకునేందుకు ఢిల్లీలో పోరాటం చేస్తామని తెలిపారు. రేవంత్ రెడ్డి స్కామ్‌కు కేంద్రం అండగా ఉందని ఆరోపించారు. మనూ భూముల కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

మైనార్టీల రక్షకుడిగా చెప్పుకునే రాహుల్ గాంధీ.. ఈ విషయంపై మాట్లాడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలను ఇస్తామని హామీ ఇచ్చారని ఉద్యోగాలు లేక అశోక్ నగర్‌లో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో రాహుల్ గాంధీ వచ్చి చూస్తే తెలుస్తుందన్నారు. రాహుల్ ఒక చేతగాని సన్నాసి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ జయశంకర్ వర్సిటీ నుంచి వంద ఎకరాలు లాక్కున్నారని, వర్సిటీ భూములపై విద్యార్థులు పోరాడినాఆ ఆందోళనను ప్రభుత్వ వర్గాలు అణచివేశాయన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో HCUకు చెందిన 400 ఎకరాల భూములపై వెనక్కి తగ్గారన్నారు. బడేబాయ్ చోటే బాయ్ ప్రభుత్వాన్ని నడిపిస్తూ వరుసగా భూముల్ని గుంజుకుంటున్నారని ఆరోపించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button