టాక్సిక్’: హాలీవుడ్ రేంజిలో తారా సుతారియా ఫస్ట్ లుక్!

యశ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న టాక్సిక్ చిత్రం నుంచి తాజాగా తారా సుతారియా ఫస్ట్ లుక్ విడుదలైంది. రెబెక్కా పాత్రలో కనిపించనున్న ఆమె లుక్ ఆకట్టుకుంటోంది. ఇంతకుముందు కియారా అద్వానీ, హుమా ఖురేషీ, నయనతారల ఫస్ట్ లుక్స్ ఆవిష్కరించిన మేకర్స్ ఇప్పుడు తారాను ఆవిష్కరించారు. వీళ్ళ లుక్స్ చూశాక ఈ సినిమా హాలీవుడ్ రేంజిలో ఉండబోతుందని స్పష్టంగా తెలుస్తుంది.
‘కెజిఎఫ్-2’ బ్లాక్ బస్టర్ తర్వాత యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ చిత్రం అందరి దృష్టీని కేంద్రీకరించింది. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఇంగ్లిష్, కన్నడ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు. తర్వాత హిందీ, తెలుగు, తమిళం, మలయాళంలో డబ్బింగ్ చేసి విడుదల చేయనున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె నారాయణ, యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇప్పటివరకు కియారా అద్వానీ, హుమా ఖురేషీ, నయనతారల ఫస్ట్ లుక్స్ విడుదలైన నేపథ్యంలో తాజాగా తారా సుతారియా రెబెక్కా పాత్రలో ఆవిష్కరించబడింది. ఈ చిత్రం మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది. ఈ ఆవిష్కరణలన్నీ త్వరలో జరగబోయే ఒక పెద్ద ప్రకటనకు దారి తీస్తున్నట్లు సమాచారం. చూస్తుంటే ఈ సినిమా హాలీవుడ్ రేంజిలో ఉండబోతుందని స్పష్టంగా తెలుస్తుంది.



