సినిమా

Mass Jathara: మాస్ జాతర టీజర్ టైం ఫిక్స్!

Mass Jathara: రవితేజ నటిస్తున్న మాస్ జాతర సినిమా టీజర్ ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ చిత్రం ఆగస్టు 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. దీంతో ఫ్యాన్స్‌లో ఉత్సాహం నెలకొంది.

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ జాతర సినిమా టీజర్ ఆగస్టు 11న ఉదయం 11:08 గంటలకు విడుదలవుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ చిత్రం ఆగస్టు 27న గణేష్ చతుర్థి సందర్భంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. టీజర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రవితేజ విలక్షణమైన యాక్షన్, కామెడీతో పాటు ఎనర్జిటిక్ సాంగ్స్ ఈ చిత్రంలో ఆకట్టుకునే అంశాలుగా ఉండనున్నాయి. సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button