తెలంగాణ

Kavitha: నాన్నా.. మీ చుట్టూ ఏం జరుగుతోందో చూసుకోండి

Kavitha: బీసీ రిజర్వేషన్ల కోసం తాను కాంగ్రెస్ పార్టీపై పోరాడుతూ ఒత్తిడి తీసుకొచ్చానని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కానీ బీఆర్ఎస్ లోని కొందరు నాపై దుష్ప్రచారం చేయించారని చప్పారు. బహుజన తెలంగాణ కోసం పోరాటం చేస్తుంటే తనను బదనాం చేసే కార్యక్రమాన్ని వారు కొనసాగించారన్నారు. హరీశ్ రావు, సంతోష్ ఇళ్లలో బంగారం ఉంటే బంగారు తెలంగాణ కాదన్నారు. బంగారు తెలంగాణ కేసీఆర్ ఇచ్చిన నినాదమే, దానిని సాధించాల్సిన బాధ్యత పార్టీ సభ్యులందరిపై ఉందన్నారు.

తాను అదే మాట్లాడినా. నాపై కుట్ర జరిగిందని చెప్పారు. తెలంగాణ భవన్ లోనే తాను ప్రెస్ మీట్ పెట్టి ఈ కుట్రలపై వివరించినా, కేటీఆర్.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇంత వరకు తనతో మాట్లాడలేదని వాపోయారు. 103 రోజులైనా బాధ్యతగా ఏం జరిగిందని తనను అడగలేదని, ఓ మహిళా ఎమ్మెల్సీగా తనకే ఇంతటి కుట్రలు జరిగితే, మిగతా వారి పరిస్థితి ఏమిటి? అని ఆమె ప్రశ్నించారు.

గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్ ను పార్టీ ప్రకటించిందని, అయితే ఇక్కడ కూడా హరీశ్ రావు డ్రామాలాడారని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు. బీజేపీ వారితో లోపాయికారి ఒప్పందం చేసుకొని, పోటీగా మరో క్యాండిడేట్ ను పెట్టాలని నిర్ణయించారని చెప్పారు. మన పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయిన తర్వాత మనం ఎలా గెలుస్తాం అది సాధ్యం కాదని కేసీఆర్ చెప్పారన్నారు.. హరీశ్ రావు ఇలా ట్రబుల్స్ ను క్రియేట్ చేస్తారని చెప్పారు. అందుకే వారిని నమ్మొద్దని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో కొందరు కాంగ్రెస్, బీజేపీలతో టచ్ లో ఉన్నారని చెప్పార.

2018 ఎన్నికలలో 25 మంది ఎమ్మెల్యేలకు హరీశ్ రావు అదనపు ఫండింగ్ ఇచ్చారని, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆమె ప్రశ్నించారు. ఆ డబ్బు కాళేశ్వరంలోని అవినీతి డబ్బులేనని ఆమె అన్నారు. సిరిసిల్లలో కేటీఆర్ ను ఓడించేందుకు రూ.60 లక్షల రూపాయలు పంపించారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.. అవి ఎక్కడి నుంచి వచ్చాయే అందరూ ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ను ఓడించేందుకు కూడా ఇలాంటి కుట్రలే చేశారని చెప్పారు. ఇలాంటి వారిని పార్టీలో మీ పక్కన ఉంచుకుంటే చాలా ప్రమాదమని హెచ్చరించారు.

హరీశ్ రావు , రేవంత్ రెడ్డిలు ఒకే ఫ్లైట్ లో ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాతే తనపై కుట్రలు ప్రారంభమయ్యాయని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. తాము నికార్సుగా కొట్లాడుతున్నం కాబట్టే తమపై కేసులు అవుతున్నాయని, హరీశ్ రావు మీడియాను మేనేజ్ చేస్తూ కేసులు లేకుండా బయటపడుతున్నారని చెప్పారు. కాబట్టే ఆయనపై ఎలాంటి కేసులు కావడం లేదన్నారు. ఆయన పాల వ్యాపారంపై ఆరోపణలు వచ్చినా రెండు రోజుల్లోనే పక్కదారి పట్టించారని గుర్తు చేశారు.

తనకు నోటీసు రాగానే మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కటిగా వేదికపై కూర్చొని మాట్లాడారని, దీనికి తాను సంతోషిస్తున్నానని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు. ఈ ప్రజాస్వామ్యం పార్టీలో రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. పార్టీలో వ్యక్తిగత లబ్ధికోసం పనిచేసే వ్యక్తుల వల్లే తనను సస్పెండ్ చేశారని చెప్పారు. కానీ కేసీఆర్ చుట్టు కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు.. ఇవ్వాళ తనను పార్టీ నుంచి బయటకు పంపించారు, రేపు కేటీఆర్ ను కూడా బయటికి పంపిస్తారు. అందుకే జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నానని హెచ్చరించారు.

తన ప్రాణమున్నంత వరకు కేసీఆర్ కు హాని జరగాలని కోరుకోను అని అన్నారు. కేసీఆర్ బిడ్డగా పుట్టడం తన అదృష్టమని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. 2014 నుంచి తాను పోరాటంలోనే ఉన్నానని, అధికారంలోనే ఉన్నా, లేకున్నా తాను ప్రతిపక్ష నేతలాగే ఉన్నానని చెప్పారు. ఇటీవల అసెంబ్లీలో కేసీఆర్ ను తిడుతుంటే తనకు మస్తు బాధ అనిపించిందన్నార. కానీ హరీశ్ రావు ఒంటరిగా పోరాటం చేసినట్లు మీడియాను మేనేజ్ చేశారని చెప్పారు.

ఏ ప్రభుత్వంలోనైనా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారు. 40వేల కోట్లు కూడా కాళేశ్వరానికి ఖర్చు కాలేదు. కానీ లక్ష కోట్లు ఖర్చు చేశారని ఆరోపిస్తున్నారని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. దీనిపై హరీశ్ రావు మాట్లాడరని, ఎందుకంటే వారికి, వారికి మధ్య లోపాయికారి ఒప్పందం ఉందన్నారు. అందుకే రామన్నకు జాగ్రత్తలు చెబుతున్నా. మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

పార్టీ నుంచి నాకు వచ్చిన ఎమ్మెల్సీ పదవికి, పార్టీ అన్ని పదవులకు నేను రాజీనామా చేస్తున్నానని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అధికారం కోసం తాను పార్టీలోకి రాలేదని, మా నాన్న కోసమే ఉద్యమంలోకి వచ్చామని చెప్పారు. అందుకే మాపై పార్టీలో కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశరారు.

కేసీఆర్ పై సీబీఐ విచారణకు ఆదేశించారంటే, అది కేవలం హరీశ్ రావు వల్లేనని ఫైర్ అయ్యారు. ఉద్యమంలో హరీశ్ రావు మొదటి నుంచి లేరని, ఆయన ట్రబుల్ షూటర్ కాదు బబుల్ షూటర్ అని సంచలన ఆరోపణలు చేశారు. సమస్యను ఆయనే సృష్టిస్తారు. తిరిగి సమస్యను పరిష్కరించినట్లు నాటకం ఆడుతారని చెప్పారు. హరీశ్ రావును నమ్మొద్దని హెచ్చరించారు.

ఈటల, జగ్గారెడ్డి, విజయశాంతి, మైనంపల్లి లాంటి వారంతా హరీశ్ రావు వల్లే పార్టీ నుంచి వెళ్లిపోయా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు. కేటీఆర్ యూట్యూబ్ ను మేనేజ్ చేస్తే హరీశ్ రావు మీడియాను మేనేజ్ చేస్తారని చెప్పారు. హరీశ్ రావు నక్క జిత్తులను అందరూ గమనించాలని కోరారు.

నిజామాబాద్ లో చికెన్ గున్యా వచ్చి బాధపడుతుంటే తాను ఎంతో సేవ చేశానని, కానీ కేసీఆర్ తనను గుర్తించలేదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. హరీశ్ రావు, సంతోష్ ల మాయలో ఉన్నారని,. వాళ్లు కూడా ఏదో ఒక రోజు ఇంతకు ఇంత అనుభవిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను 20 ఏళ్లుగా తెలంగాణ కోసం పోరాడుతున్నానని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్పార. సడెన్ గా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.. అలాగే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ చూసే వాళ్లలో కూడా దుర్మార్గులు ఉన్నారన్నారు. తనమాటలు వక్రీకరించారని చెప్పారు. తెలంగాణ ఆత్మగా తాను ఇన్నేళ్లు పని చేశానని చెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button