సినిమా
శ్రీశైలం మల్లన్న సేవలో సినీ హీరో మంచు విష్ణు

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను సినిమా హీరో మంచు విష్ణు దర్శించుకున్నారు దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న సినిమా హీరో మంచు విష్ణు కి అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం స్వామివారికి అభిషేకం అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించుకుని దర్శించుకున్నారు దర్శనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం చేయగా, తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ శ్రీశైల భ్రమరాంబ మల్లిక స్వామివారిని దర్శించుకున్నాను దీంతో 12 జ్యోతిర్లింగాలు యాత్ర పూర్తి చేసుకోవడం జరిగింది ఈనెల 27వ తారీఖున కన్నప్ప సినిమా రిలీజ్ అవుతుంది ప్రేక్షకులందరూ ఈ సినిమాను చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను.