తెలంగాణ
Seethakka: రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన మంత్రి సీతక్క

ఆదివాసీ గిరిజన విద్యార్థులు క్రీడల్లో నైపుణ్యతను ప్రోత్సహించి ప్రతిభావంతులను చేయడమే రాష్ట్ర స్థాయి గిరిజన సంక్షేమ క్రీడా పోటీల ముఖ్య ఉద్దేశమన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా ఏటూరునాగారంలోని జంబోరి మైదానంలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను మంత్రి సీతక్క ప్రారంభించారు.
రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడా పోటీలు ములుగు జిల్లాలో నిర్వహించడం గర్వకారణమన్నారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజన క్రీడాకారుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందన్నారు. వారి ఎదుగుదలకు, అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడూ ముందుటారన్నారు.



