తెలంగాణ
Seethakka: శాసన మండలిలో పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు ఆమోదం

Seethakka: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఇవాళ పంచాయతీరాజ్ సవరణ బిల్లును ఏకగ్రీవంగా తెలంగాణ శాసనమండలి ఆమోదించింది. పంచాయతీరాజ్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా.. సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానమిచ్చారు. సభ్యులు ప్రతిపాదనలను పంపితే పరిశీలిస్తామన్నారామె. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు షెడ్యూల్ ఏరియాలో గుర్తించామన్నారు.
ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పించేందుకు, అభివృద్ధి జరిగేందుకు 1/70 కృషి చేస్తుందన్నారు మంత్రి. రాష్ట్రపతి ఉత్తర్వులు మేరకు ఏజెన్సీ గ్రామాలను గుర్తించామని ఆ చట్టం అమల్లో ఏవైనా సమస్యలుంటే పరిష్కరిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎన్నో గందరగోళాలు తలెత్తుతున్నాయంటున్నారు. స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించుకున్నామని సీతక్క చెప్పారు