బాలయ్య సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్?

నందమూరి బాలకృష్ణ 111వ చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం తమన్నాను ఫిక్స్ చేశారు. వచ్చే నెల మూడో వారం నుంచి ఈ పాట షూటింగ్ జరగనుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ మాస్ ఎంటర్‌టైనర్ రూపొందుతోంది.
నందమూరి బాలకృష్ణ ఫుల్ జోష్‌లో ఉన్నారు. వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత ఇప్పుడు బోయపాటి శ్రీనుతో అఖండ-2 ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో ఆయన 111వ చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వేగంగా ప్రోగ్రెస్ అవుతోంది. వచ్చే నెల మూడో వారం నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.
ఈ షెడ్యూల్‌లో ఒక భారీ స్పెషల్ సాంగ్ చిత్రీకరణ ఉంటుందని, దానికి మిల్కీ బ్యూటీ తమన్నాను ఎంపిక చేశారని సమాచారం. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్య-తమన్నా జోడీ స్టెప్పులు ఎలా ఉంటాయో చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



