ఆంధ్ర ప్రదేశ్
Travels Bus: పేలిన టైరు.. ట్రావెల్స్ బస్సు దగ్ధం

బస్సు టైర్ పేలి బస్సు దగ్ధమైన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున గార్లదిన్నె మండలం తలగాసిపల్లి క్రాస్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి రాయచూర్‌కు వెళ్తుండగా బస్సు టైర్ పేలి మంటలు వ్యాపించగా బస్సులోని ప్రయాణికులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు



