తెలంగాణ
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరుగా వానలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో 44 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రధానంగా సింగరేణి ఉపరితల గన్నుల్లో వర్షపు నీరు చేరడంతో పనులకు ఆటంకం ఏర్పడింది.స త్తుపల్లి జేవియర్ ఓపెన్ కాస్ట్, కిష్టారం ఉపరితల గనుల్లో 25 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జిల్లాలో వాగులు, వంకలు అలుగులు పోస్తున్నాయి.



