Droupadi Murmu: సినిమాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి

Droupadi Murmu: సినిమా రంగంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ఆమె మాట్లాడారు. స్త్రీ ప్రతిభకు గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. పూర్తి వివరాలు చూద్దాం.
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. 2023కు గానూ ఎంపికైన చిత్రాలు, నటీనటులకు అవార్డులు అందజేశారు. సినిమా రంగంలో మహిళలకు సమాన అవకాశాలు, జ్యూరీలో ప్రాతినిధ్యం కల్పించాలని ఆమె పిలుపునిచ్చారు. సినిమా కేవలం వినోదం కాదు, సమాజాన్ని ప్రభావితం చేసే శక్తిమంతమైన మాధ్యమమని పేర్కొన్నారు. ఈ వేడుకలో మోహన్లాల్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది.
షారుక్ ఖాన్, విక్రాంత్ మస్సే, రాణీ ముఖర్జీ, విధు వినోద్ చోప్రా అవార్డులు అందుకున్నారు. తెలుగు నుంచి ‘భగవంత్ కేసరి’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. సమాజంలో చైతన్యం తెచ్చే కథలు, స్త్రీల ధైర్యాన్ని చాటే చిత్రాలు రావాలని ఆమె కోరారు. ‘గాంధీ తాత చెట్టు’ చిత్రంలో సుకృతి పర్యావరణ స్పృహను చాటిన నటనకు రాష్ట్రపతి ప్రశంసలు అందించారు.



