ఆంధ్ర ప్రదేశ్
ప్రియుడి చేతిలో వివాహిత హత్య

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడి చేతిలో వివాహిత పుష్ప హత్యకు గురైంది. మొదటి పెళ్లి తర్వాత పుష్ప విడాకులు తీసుకుంది. అయితే మరో వ్యక్తి సమ్మతో పుష్పకు పరిచయం ఏర్పడింది. అది సహజీవనం వరకూ వెళ్లగా పెద్దల సమక్షంలో పెళ్లిచేసుకున్నారు.
ఈ క్రమంలోనే రాత్రి మద్యం మత్తులో ఇరువురి మధ్య జరిగిన ఘర్షణలో పుష్పను ఛాతిలో పొడిచి సమ్మ పరారయ్యాడు. దీంతో పుష్ప అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అడ్డుకునేందుకు వెళ్లిన పుష్ప తల్లి, అన్నపై కూడా దాడికి పాల్పడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.



