ఆంధ్ర ప్రదేశ్
అదుపు తప్పి ముళ్ల కంపలోకి దూసుకెళ్లిన బస్సు

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం వేములకోట వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు ప్రమాదం తప్పింది. రాయల్ ఓవైజ్ ట్రావెల్ బస్సు మార్కాపురం నుండి బెంగళూరు వెళ్లే క్రమంలో వేములకోటవద్ద బస్సు అదుపుతప్పి ముళ్ళకంపలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ప్రయాణీకులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఒక్కసారిగా బస్సు అదుపుతప్పడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు, ఆర్టీఓ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రెండురోజుల క్రితం కర్నూలు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్ ప్రమాదానికి గురై అధిక ప్రాణనష్టం జరిగిన సంగతి తెలిసిందే.



