తెలంగాణ
Tiger: రాంపూర్‌లో అటవీప్రాంతంలో పులి కలకలం..

Tiger: మహబూబాబాద్ జిల్లా రాంపూర్‌లో అటవీప్రాంతంలో పులి కలకలం రేపుతోంది. పులి ఆనవాళ్లను అధికారులు గుర్తించారు. అటవీ శాఖ అధికారి విశాల్, ఎఫ్డిఓ చంద్ర శేఖర్ , కొత్తగూడ రేంజ్ ఆఫీసర్ వజహత్ లు తమ బృందంతో కలిసి పరిశీలిస్తున్నారు. ఆనవాళ్ల ఆధారంగా మగపులి అని అటవీశాఖ అధికారులు నిర్ధారిస్తున్నారు.
ప్రస్తుతం పులి కర్నగండి, కామారం, గుండాల, ములుగు, నర్సంపేట ప్రాంతాల్లో పులి ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ప్రజలు తమ వ్యవసాయ పనులు సాయంత్రం ఐదు గంటల లోపు ముగించుకొని… ఇండ్లలో ఉండేటట్టు చూసుకోవాలని అటవీశాఖ అధికారులు సూచించారు. పులి కదలికలకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారాన్ని అందించాలన్నారు.