తెలంగాణ
Mastan Sai Case: మస్తాన్ సాయి పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు

Mastan Sai case: మస్తాన్ సాయి పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. అమ్మాయిలకు కిట్టీ పార్టీని ఎరగా వేసి వారికి ఆల్కహాల్ ఇచ్చి, డ్రగ్స్ అలవాటు చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. మత్తులో ఉండగా వీడియోలను తీసి బ్లాక్ మెయిల్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు.. సాయికి సహకరించిన ఖాజా వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
మస్తాన్ సాయిపై ఫిర్యాదు సందర్భంగా.. పోలీసులకు లావణ్య హార్డ్‌డిస్క్ అందించారు. దాంట్లో ఉన్న వీడియోలు, ఆడియోలతో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీల ప్రైవేట్ వీడియోల పైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. 43 మంది అమ్మాయిలకు సంబంధించిన వందకు పైగా వీడియోలు ఆ హార్డ్‌డిస్క్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి కాల్ డేటాను పోలీసులు రిటీవ్ చేస్తున్నారు.