తెలంగాణ
Chevella: చేవెళ్ల బస్సు ప్రమాదంపై కేసీఆర్, కేటీఆర్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

Chevella: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న దుర్ఘటనలో 19 మంది ప్రయాణికులు మృతి చెందడం పట్ల వారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.



