Vishal: విశాల్ అస్వస్థత.. అసలు కారణం ఏమిటి?

Vishal: ప్రముఖ తమిళ హీరో విశాల్ అస్వస్థతకు గురై అభిమానులను ఆందోళనకు గురిచేశారు. విల్లుపురంలో జరిగిన ఓ ఈవెంట్‌లో ఆయన స్పృహ తప్పి కుప్పకూలడం సంచలనంగా మారింది. అసలు విశాల్‌కు ఏమైంది? ఆరోగ్య సమస్యలే కారణమా? తాజా వివరాలు ఇవిగో..
తమిళనాడు విల్లుపురంలో ఓ కార్యక్రమానికి విశాల్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. వేదికపై ఉండగా ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోవడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. నెటిజన్లు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఆరా తీశారు. గతంలోనూ విశాల్ అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
తాజాగా విశాల్ మేనేజర్ క్లారిటీ ఇచ్చారు. మధ్యాహ్నం ఆహారం సకాలంలో తీసుకోకపోవడంతో విశాల్ అస్వస్థతకు గురైనట్లు వెల్లడించారు. వైద్యులు చికిత్స అందించగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, సమయానికి ఆహారం తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. ఈ వార్తతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.