తెలంగాణ
తిరుమల శ్రీవారికి విలువైన కానుక సమర్పించిన తెలంగాణ ఎంపీ

తెలంగాణ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తిరుమల శ్రీవారికి 60 లక్షల రూపాయల విలువైన 535 గ్రాముల అష్టలక్ష్మీ చంద్రవంక కంఠిని విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలకు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి, చంద్రవంక కంఠి ఆభరణాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర రెడ్డిని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు శాలువాతో సన్మానించారు.



