సుడిగాలి సుధీర్ పాన్ వరల్డ్ సినిమా షురూ!

జబర్దస్త్ స్టార్ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘హైలెస్సో’ గ్రాండ్‌గా ప్రారంభమైంది. టాలీవుడ్ నటుడు నిఖిల్ టైటిల్ లాంచ్ చేయగా, ప్రముఖ దర్శకులు షూటింగ్ స్టార్ట్ చేశారు. గ్రామీణ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. పూర్తి వివరాలు చూద్దాం.
సుడిగాలి సుధీర్ కెరీర్లో 5వ సినిమా ‘హైలెస్సో’ గ్రామీణ నేపథ్యంలో మైథలాజికల్ ఎలిమెంట్స్‌తో రూపొందుతోంది. టైటిల్ పోస్టర్లో రాజసంగా కనిపించే పాదం, సింధూరం కలిపిన అన్నం, రక్తంతో తడిసిన కత్తి జాతర సంప్రదాయాన్ని సూచిస్తున్నాయి. నటాషా సింగ్, నక్ష కిరణ్ హీరోయిన్లుగా, శివాజీ విలన్‌గా నటిస్తున్నారు. అక్షర గౌడ ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది.
ప్రసన్న కుమార్ కోట దర్శకత్వంలో వజ్ర వారాహి సినిమాస్ బ్యానర్‌పై శివ చెర్రీ, రవికిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా పలు భాషల్లో విడుదల కానుంది. ఈ పాన్ వరల్డ్ మూవీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది.



