అంతర్జాతీయం
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం విషమం

Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వాటికన్ ప్రకటించింది. న్యూమోనియా, ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయన శ్వాస తీసుకోవటానికి ఇబ్బందిపడుతున్నట్లు తెలిపింది. వైద్యులు ఆయనకు హై ఫ్లో ఆక్సిజన్ అందిస్తున్నారు.
ఈనెల 14న పోప్ ఫ్రాన్సిస్ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు జరిపిన పరీక్షల్లో ఆయన కిడ్నీ విఫలం అయినట్లు వెల్లడైంది. పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం విషమంగా ఉన్న నేపథ్యంలో, ఆయన కోలుకోవాలని భక్తులు ప్రార్థనలు చేస్తున్నారు.