ఆంధ్ర ప్రదేశ్

Tirumala: శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

Tirumala: మరో వారం రోజుల్లో రానున్న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఇవాళ తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించారు. మూలవర్లకు ప్రాత:కాల పూజ కైంకర్యాలు, అరగింపులు నిర్వహించిన అనంతరం ఆలయం మొత్తం నీటితో శుభ్రం చేశారు.

పసుపు, రక్తచందనం, పచ్చకర్పూరం, శ్రీగంధం, పచ్చకర్పూరం, తదితర సుగంధద్రవ్యాలతో చేసిన లేహ్యాని ఆలయం గోడలకు లేపనం చేసారు. అనంతరం నీటితో శుద్ధి చేసి, మూలమూర్తికి చుట్టున వస్త్రాన్ని తొలిగించి అభిషేక పూజ కార్యక్రమాలు పూర్తిచేసి సామన్య భక్తులకు దర్శనం కల్పించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button