తెలంగాణ
Uttam Kumar Reddy: 71 శాతం నీటి వాటాకు పట్టుబడుతాం

Uttam Kumar Reddy: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణాకు న్యాయంగా రావాల్సిన నీటి వాటాను సద్వినియోగం చేసుకుంటామన్నారు. త్రాగు,సాగు నీటితో సహా పరిశ్రమలకు నీటి వినియోగానికి చర్యలు తీసుకుంటామన్నారు.
ఈనెల 23న జరగనున్న కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్-2 సమావేశంలో బలమైన వాదనలు వినిపిస్తామన్నారు. తనతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ చర్చలలో పాల్గొంటామన్నారు. 71శాతం నీటివాటాకు పట్టుబడుతామన్నారు.



