తెలంగాణ
సత్తుపల్లిలో భారీ వర్షం.. సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సత్తుపల్లి జేవీఆర్, కిష్టారం ఓపెన్‌కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జేవీఆర్ ఓసీలో 40 వేల టన్నులు కిష్టారం ఓసీలో 8 వేల టన్నుల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వర్షపు నీటిని తోడేందుకు 240 హెచ్‌పీ మోటార్లను వినియోగిస్తున్నారు.



