సినిమా
Ainavalli: విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకున్న నటుడు బెల్లంకొండ శ్రీనివాస్

Ainavalli: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు సినీ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ సందర్భంగా స్వామివారికి 10 వేల కొబ్బరికాయల మొక్కు తీర్చుకున్నారు. “కిష్కింధపురి” సక్సెస్ కావడంతో మొక్కు చెల్లించుకున్నట్లు బెల్లంకొండ తెలిపారు.
50 వేల మొక్కులో భాగంగా తొలి విడతగా పదివేల కొబ్బరికాయల మొక్కులు చెల్లించుకున్నట్లు చెప్పారు. స్వామివారి మొక్కు తీర్చుకోవడం పట్ల తనకు చాలా సంతోషంగా ఉందన్నారు బెల్లంకొండ. ఇక స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.



