ఆంధ్ర ప్రదేశ్
ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో భోగి సంబరాలు

విజయవాడలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో సంబరాలు అంబరాన్నంటాయి. కూటమి నేతలతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్.. భోగి మంటల్ని వెలిగించారు. వేడుకల్లో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, ఇతర నేతలు పాల్గొన్నారు. ఏపీ ప్రజలకు ఎంపీ కేశినేని శివనాథ్.. శుభాకాంక్షలు తెలిపారు.



