సినిమా

Rai Teja: రవితేజ కొత్త సినిమాకు క్రేజీ టైటిల్‌!

Ravi Teja: మాస్‌ మహారాజా రవితేజ మరో రియలిస్టిక్‌ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘ఇరుముడి’ అనే క్రేజీ టైటిల్‌ పరిశీలిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విశేషాలు చూద్దాం.

మాస్‌ మహారాజా రవితేజ కొత్త చిత్రం సైలెంట్‌గా షూటింగ్‌ ప్రారంభమైంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రియలిస్టిక్‌ ప్రాజెక్టు మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు ‘ఇరుముడి’ అనే వెరైటీ టైటిల్‌ను మేకర్స్‌ పరిశీలిస్తున్నట్టు సమాచారం. రవితేజ కెరీర్‌లో ఇది చాలా భిన్నమైన టైటిల్‌గా భావిస్తున్నారు.

ప్రియా భవాని శంకర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. 2026 సమ్మర్‌లో ఈ సినిమాను రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. రవితేజ ఈ ప్రాజెక్టుకు భారీగా డేట్స్‌ ఇవ్వడంతో షూటింగ్‌ వేగంగా పూర్తవుతుందని తెలుస్తోంది. ఈ చిత్రం కోసం రవితేజ ప్రాఫిట్‌ షేరింగ్‌ పద్ధతిలో పని చేస్తున్నాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button