Chiranjeevi: ఆనంద్ మహీంద్ర అద్భుతం

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రను కొనియాడారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో కలిసిన అనంతరం ఆయన వినయం, నిరాడంబరతను ప్రశంసించారు. రతన్ టాటాను గుర్తుచేశారు.
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో మెగాస్టార్ చిరంజీవి, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర కలయిక సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ సమావేశం అనంతరం చిరంజీవి ట్విట్టర్‌లో ఆనంద్ మహీంద్ర వ్యక్తిత్వాన్ని కొనియాడారు. ఆయన వినయం, నిరాడంబరత హృదయానికి హత్తుకుందని, ఆ లక్షణాలను తాను ఎంతో గౌరవిస్తానని పేర్కొన్నారు.
ఆనంద్ మహీంద్ర తన విలువలు, కార్యాలతో దివంగత రతన్ టాటాను గుర్తుచేస్తున్నారని అన్నారు. ఆయన సామాజిక సేవా కార్యక్రమాలు తనకు స్ఫూర్తినిస్తున్నాయని, భవిష్యత్తులో కలిసి సార్థక కార్యక్రమాలు చేయాలని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి స్ఫూర్తిదాయక సంభాషణల కోసం ఎదురు చూస్తున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు.



