ఆంధ్ర ప్రదేశ్
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు పెంచింది. కేసులో కీలక నిందితుడు ఏ-16 అజయ్ కుమార్ సుగంద్ను సిట్ అరెస్ట్ చేసింది. బోలేబాబా కంపెనీకి కెమికల్స్ సరఫరా చేశాడు అజయ్. లడ్డూలు తయారు చేసే నెయ్యిలో 90 శాతానికి పైగా పామాయిల్ వినియోగించినట్లు గుర్తించారు. పామాయిల్ తయారీకి కెమికల్స్ వాడాడు అజయ్. నెల్లూరు ఏసీబీ కోర్టులో అజయ్‌ను హాజరుపరిచారు సిట్ అధికారులు. అజయ్‌కు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది న్యాయస్థానం.



