సినిమా
దుల్కర్, పృథ్విరాజ్ సుకుమారన్ ఇంట్లో కస్టమ్స్ అధికారుల సోదాలు

మలయాళ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్విరాజ్ సుకుమారన్ ఇంట్లో కస్టమ్స్ అధికారులు రైడ్ నిర్వహించారు. కోచ్చిలోని వారి నివాసాల్లో సోదాలు చేపట్టారు. లగ్జరీ కార్ల స్మగ్లింగ్ ఆరోపణలకు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు ఆపరేషన్ నమకూర్ చేపట్టారు. ఇందులో భాగంగానే దుల్కర్, పృథ్విరాజ్ నివాసాలతో పాటు కేరళలోని 5 జిల్లాల్లో 30 చోట్ల సోదాలు జరుపుతున్నారు.
లగ్జరీ కార్లను భూటాన్ నుంచి అక్రమంగా తెప్పించుకున్నారని దుల్కర్, పృథ్విరాజ్ లపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు భూటాన్ ఆర్మీకి చెందిన హైఎండ్ వాహనాలను కొనుగోలు చేసి అక్రమంగా రీసేల్ చేసే గ్యాంగు నుంచి వాహనాలను కొనుగోలు చేసినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు.



