సినిమా

అరబిక్‌లోనూ రామాయణం!

రణబీర్ కపూర్ హీరోగా నితీశ్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం రామాయణం. ఈ సినిమాను అరబిక్ భాషలో కూడా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే అరబిక్ గ్లింప్స్ విడుదల చేశారు. ఈ నిర్ణయం ఎంతమేర వర్కౌట్ అవుతుందో చూడాలి. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.

దంగల్ ఫేమ్ నితీశ్ తివారి దర్శకత్వంలో రూ.4 వేల కోట్లకు పైగా బడ్జెట్‌తో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ‘రామాయణం’ సినిమా ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో రిలీజ్ కానుంది. రణబీర్ కపూర్ (రాముడు), సాయిపల్లవి (సీత), యశ్ (రావణుడు), సన్నీ డియోల్ (హనుమంతుడు) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్‌తో పాటు హాలీవుడ్ సంగీత దిగ్గజం హన్స్ జిమ్మర్ కూడా సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన షో రీల్ అద్భుత విజువల్స్‌తో ప్రేక్షకులను అబ్బురపరుస్తోంది.

ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయాలన్న కృతనిశ్చయంతో చిత్రబృందం ఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్ వంటి పలు భాషలతో పాటు అరబిక్ భాషలో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే అరబిక్ వెర్షన్ గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు. మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా దేశాల్లో అరబిక్ మాట్లాడే ముస్లిం ప్రేక్షకులు హిందూ పురాణ గాథ మీద ఆసక్తి చూపుతారా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. అయినా రామాయణ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలన్న లక్ష్యంతో చిత్రబృందం ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button