ఆంధ్ర ప్రదేశ్
YS Sharmila: రాష్ట్ర ప్రజలను పీల్చి పిప్పి చేసే ఛార్జీలు

YS Sharmila: విద్యుత్ సర్దుబాటు పేరుతో ప్రజల మీద కూటమి ప్రభుత్వం విధిస్తుంది సర్దుపోటు అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. పెంచేది లేదంటూనే జనాలకు బాబు పెడుతున్నవి షాకుల మీద షాకులిస్తున్నారన్నారు. అవి ట్రూ అప్ ఛార్జీలు కాదు సామాన్యుడి నడ్డి విరిచే ఛార్జీలు అన్నారు. రాష్ట్ర ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారని షర్మిల ఘాటుగా స్పందించారు.
జనం నెత్తిన మీరు పెడుతున్నది గుదిబండ అన్నారు. ఇది చాలదన్నట్లు మరో 12 వేల కోట్ల వరకు అధిక భారాన్ని మోపాలని చూడడం దుర్మార్గం అన్నారు. ట్రూ అప్ ఛార్జీల వసూళ్లపై విద్యుత్ నియంత్రణ మండలి ప్రజాభిప్రాయం సేకరిస్తుంటే కూటమి ప్రభుత్వం మౌనం వహించడం సిగ్గుచేటన్నారు.



