జాతియం
ISRO: శ్రీహరికోటలో LVM3-M6 రాకెట్ ప్రయోగం సక్సెస్

ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వాణిజ్య ప్రయోగాల్లో మరో కీలక మైలురాయిని నమోదు చేసింది. బుధవారం ఉదయం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగ వేదిక నుంచి ప్రయోగించిన LVM3-M6 రాకెట్ విజయవంతమైంది. అమెరికాకు చెందిన AST స్పేస్‌మొబైల్ సంస్థ రూపొందించిన అత్యంత బరువైన ‘బ్లూబర్డ్ బ్లాక్-2’ ఉపగ్రహాన్ని ఈ రాకెట్ నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
ఉదయం 8:55 గంటలకు, నిర్దేశిత సమయానికి 90 సెకన్లు ఆలస్యంగా రాకెట్ నింగిలోకి దూసుకెళ్లి, కేవలం 15 నిమిషాల్లో మూడు దశలను పూర్తి చేసింది. అనంతరం భూమికి 520 కిలోమీటర్ల ఎత్తులోని లో-ఎర్త్ ఆర్బిట్‌లో సుమారు 6,100 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇది భారత భూభాగం నుంచి ప్రయోగించిన అత్యంత బరువైన వాణిజ్య ఉపగ్రహంగా రికార్డు సృష్టించింది.



