తెలంగాణ

Komatireddy: రహదారులు, ఫ్లైఓవర్ల నిర్మాణంపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష

Komatireddy Venkat Reddy: రాష్ట్రంలోని పలు రహదారులపై చర్చించేందుకు ఢిల్లీ నుండి వచ్చిన MoRTH,NHAI అధికారులతో సెక్రటేరియట్ లో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సమావేశమయ్యారు. సీఎంతో సమావేశానికి ముందు MoRTH డైరెక్టర్ జనరల్ వినయ్ కుమార్ రజావత్, NHAI మెంబర్ అనిల్ చౌదరి తో ఆయన చర్చించారు. రాష్ట్రంలో పురోగతిలో ఉన్న పలు NHAI ప్రాజెక్ట్స్,పెండింగ్ రహదారులు,పలు ఫ్లై ఓవర్ల నిర్మాణం పై చర్చించారు.

హైదరాబాద్- విజయవాడ హైవే పై 17 బ్లాక్ స్పాట్స్,ఫ్లై ఓవర్లు నిర్మాణం,రాష్ట్రంలోని పలు నూతన కారిడార్లు,రీజినల్ రింగ్ రోడ్డు,ఫారెస్ట్ క్లియరెన్స్ తోపాటు పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, ప్రభుత్వ స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button