తెలంగాణ
బెల్లంపల్లి పట్టణంలో వ్యాపారస్తుల బంద్

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో వ్యాపారస్తులు బంద్ నిర్వహించారు. రోడ్డు వెడల్పు ప్రక్రియలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపులను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న మున్సిపల్ సిబ్బందిని వ్యాపారస్తులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
పోలీసుల జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పారు. రేపటి వరకు వ్యాపారస్తులు స్వయంగా తొలగించాలని లేని యడల మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. మున్సిపల్ అధికారుల చర్యతో పట్టణ వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్కు పిలుపునిచ్చారు. తమ షాపులను మూసివేసి స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు.



