KTR: కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం.. అబద్ధాలతో అధికారంలోకి వచ్చారు

KTR: కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని ఆరోపించారు. కొల్లాపూర్‌లో ఇకపై కాంగ్రెస్ మళ్లీ గెలిచే పరిస్థితి లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి పూర్తిగా శూన్యమని, కేసీఆర్ పాలనలో తెలంగాణ వ్యాప్తంగా అనేక చెక్‌డ్యామ్‌లు నిర్మించి రైతులకు మేలు చేశారని తెలిపారు. అయితే రేవంత్ రెడ్డి పాలనలో చెక్‌డ్యామ్‌లను పేల్చేస్తున్నారని విమర్శించారు.
రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ కృషి చేశారని గుర్తుచేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ పాలనలో 90 శాతం పూర్తైందని, మిగిలిన 10 శాతం పనులు చేయడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో క్రాప్ హాలిడేలు వచ్చాయని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.



