సినిమా

మహేష్ ఫ్యాన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న జియో హాట్‌స్టార్!

సూపర్‌స్టార్ మహేష్‌బాబు గ్లోబల్ ప్రాజెక్ట్‌కు సంబంధించి నవంబర్ 15న భారీ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్‌ను మొదటిసారిగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ లైవ్‌లో స్ట్రీమ్ చేయనుంది. జియో హాట్‌స్టార్ ఈ రివీల్‌ను చేపట్టనుంది. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు తదుపరి చిత్రం గ్లోబల్ స్థాయిలో రూపొందుతోందన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి నవంబర్ 15న గ్రాండ్ రివీల్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. మరి ఆసక్తికర విషయం ఏమిటంటే, సినిమా చరిత్రలో మొదటిసారిగా ఓ ఈవెంట్‌ను ఓటీటీ ప్లాట్‌ఫామ్ లైవ్‌లో ప్రసారం చేయనుంది.

పాపులర్ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ ఈ ఫస్ట్ రివీల్‌ను చేపట్టనుందన్న అనధికారిక సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో మహేష్‌బాబు అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రతిరోజూ జియో హాట్‌స్టార్ టీమ్ ‘గ్లోబ్ ట్రాటర్’ కోసం వేస్తున్న పోస్టులు ఫ్యాన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ డేట్ వచ్చే వరకు, అనౌన్స్‌మెంట్ వీడియో రిలీజ్ అయ్యే వరకు సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్, జియో హాట్‌స్టార్ మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ కనిపిస్తోంది. ఈ ఈవెంట్ ద్వారా మహేష్ అభిమానులకు కొత్త ఆనందం లభించనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button