Akhanda 2: ‘అఖండ 2’లో విజయశాంతి

Akhanda 2: నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో సూపర్ హిట్ ‘అఖండ’ తర్వాత, ఇప్పుడు ‘అఖండ 2 – తాండవం’ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమాపై ఓ క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారట!
‘అఖండ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘అఖండ 2 – తాండవం’ కోసం అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సినీ వర్గాల సమాచారం ప్రకారం విజయశాంతి ఈ సినిమాలో రాజకీయ నాయకురాలి పాత్రలో అలరించనున్నారు.
గతంలో బాలయ్య-విజయశాంతి జోడీ ఎన్నో హిట్స్ అందించింది. మరోసారి వీరి కాంబో స్క్రీన్‌పై సందడి చేయనుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. బోయపాటి-బాలయ్య హ్యాట్రిక్ హిట్స్‌తో దూసుకెళ్తుండగా, ఈ సినిమా సెప్టెంబర్ 28న పాన్ ఇండియా లెవెల్‌లో గ్రాండ్ రిలీజ్ కానుంది.