తెలంగాణ
Ponnam Prabhakar: హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం పర్యటన

Ponnam Prabhakar: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. పట్టణంలోని సెలూన్ షాప్ లోకి వెళ్లి కటింగ్ చేయించుకొని సరదాగా గడిపారు. పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్ కి వెళ్లి కాసేపు అక్కడ ప్రజలతో ముచ్చటించారు.
అటువైపుగా వెళుతున్న పాఠశాల బస్ లోని విద్యార్థులకు అభివాదం చేశారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఓ పాఠశాల విద్యార్థికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి బాగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.