పెళ్లికి సిద్ధమైన నివేదా పేతురాజ్!

Nivetha pethuraj: టాలీవుడ్ బ్యూటీ నివేదా పేతురాజ్ తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టబోతోంది. సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన ఆమె ఎంగేజ్‌మెంట్ వార్తలు అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఆమె కాబోయే భర్త ఎవరు? ఈ ప్రేమకథ వెనుక కథేంటి? పూర్తి వివరాలు చూద్దాం..
నివేదా పేతురాజ్, తమిళ, తెలుగు సినిమాలతో అభిమానుల హృదయాలు గెలిచిన నటి, తాజాగా తన ఎంగేజ్‌మెంట్ వార్తతో వార్తల్లో నిలిచింది. ఆమె కాబోయే భర్త రాజ్‌హిత్ ఇబ్రాన్, దుబాయ్‌లో వ్యాపారవేత్త. సోషల్ మీడియా ద్వారా ఫొటోలు షేర్ చేస్తూ, ‘ఇకపై జీవితం ప్రేమమయం’ అని పేర్కొంది నివేదా. వీరిద్దరూ చాలాకాలంగా ప్రేమలో ఉన్నప్పటికీ, ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు.
ఈ ఏడాది చివరలో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరుగనుంది. 2016లో ‘ఒరు నాల్ కూతు’ తమిళ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన నివేదా, ‘మెంటల్ మదిలో’, ‘చిత్రలహరి’, ‘దాస్ కా ధమ్కీ’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయ్యింది.



