నేడు అమరావతిలో జాతీయ బ్యాంకులకు శంకుస్థాపన

అమరావతిలో నేడు 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రులు లోకేశ్, నారాయణ హాజరుకానున్నారు.
ఉదయం 10 గంటలకు రాజధాని సీడ్ యాక్సెస్ రహదారి పక్కన సీఆర్డీఏ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద మొదటి బ్లాక్‌లో కార్యక్రమం నిర్వహించనున్నారు. అమరావతిలో ఇప్పటికే వివిధ బ్యాంకుల యాజమాన్యాలు కార్యాలయాలు నిర్మించే ప్రాంతాల్లో శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశాయి.
రాజధాని అమరావతిలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల గురించి సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం చంద్రబాబు వివరించనున్నారు. రాజధాని అమరావతికి మరింత ఆర్థిక సహాయం అందించాలని సీఎం కోరనున్నారు.



