సినిమా

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’పై ప్రేక్షకుల ఆగ్రహం!

Raju Weds Rambai: అఖిల్ రాజ్, తేజస్వీ రావు జోడీగా వచ్చిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. తక్కువ టికెట్ ధరలతో ప్రేక్షకుల్ని ఆకర్షించింది. కానీ మూడో రోజు నుంచి ధరలు పెంచడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.

అఖిల్ రాజ్, తేజస్వీ రావు హీరో హీరోయిన్‌లుగా నటించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ రిలీజ్ అయిన మొదటి రోజే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. సింగిల్ స్క్రీన్‌లలో రూ.99, మల్టీప్లెక్స్‌లలో రూ.105 టికెట్ ధరలతో ప్రేక్షకులు భారీ సంఖ్యలో థియేటర్లకు తరలి వచ్చారు. అయితే మూడో రోజు నుంచి ధరలు పెంచడంతో ప్రేక్షకుల మనసు మారిపోయింది.

సోషల్ మీడియాలో నిర్మాతలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ధరలను తిరిగి తగ్గించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. శివాజీ రాజా, చైతన్య జొన్నలగడ్డ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సాయిలు దర్శకత్వం వహించగా, సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. అయితే ఇప్పటివరకు నిర్మాతలు ఈ విమర్శలపై స్పందించలేదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button