తెలంగాణ

Keesara: మిల్క్‌ డెయిరీ మేనేజర్‌పై దాడి.. పరిస్థితి విషమం

మేడ్చల్ జిల్లా కీసరలో వ్యక్తిపై హత్యాయత్నం ఘటన తీవ్ర కలకలం రేపింది. దొడ్ల మిల్క్ మేనేజర్ శ్రీనివాస్‌పై పాల వ్యాపారి కిరణ్ తల్వార్‌తో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

పాల సరఫరాకు సంబంధించి గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య నెలకొన్న వివాదాలే ఈ దాడికి దారితీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేుసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button