జాతియం
PM Modi: ప్రధాని మోదీ మెచ్చిన 'ఇప్పపువ్వు లడ్డూ

PM Modi: రాజ్‌న్యూస్ కథనాలపై ప్రధాని మోదీ స్పందించారు. ఇప్పపువ్వు తయారీపై రాజ్‌న్యూస్ ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. ‘ఆదివాసుల ముందడుగు ఇప్పపువ్వు తయారీ’ పేరుతో ప్రత్యేక కథనం ప్రసారం చేసింది రాజ్‌న్యూస్. దీంతో ఇప్పపువ్వు గురించి తెలుసుకున్న ప్రధాని మోదీ. ఇప్పపువ్వు గురించి మన్‌కీ బాత్‌లో ప్రసంగించారు. ఇప్పపువ్వు లడ్డూ గిఫ్ట్ ఆఫ్ నేచర్ అన్నారు ప్రధాని మోదీ.
అంతేకాదు ఆదివాసీ మహిళలను అభినందించారు ప్రధాని మోదీ. ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ కేంద్రమైన ఉట్నూరులో తయారు చేసే ఇప్పపువ్వు లడ్డూలపై మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. ఇప్పపువ్వు లడ్డూతో అధిక పోషకాలు ఉన్నాయంటున్నారు మోదీ. ఇప్పపువ్వుల్లో గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాల మాధుర్యం ఉంటుందన్నారు మోదీ.