తెలంగాణ
Hyderabad: మాదాపూర్‌లోని హోటల్లో భారీ అగ్ని ప్రమాదం

Hyderabad: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో హోటల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డీమార్ట్ ఎదురుగా ఉన్న కృష్ణాస్ కిచెన్ రెస్టారెంట్లో ఈరోజు మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. ప్రమాదం విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది.
అగ్ని ప్రమాదం కారణంగా ఆ చుట్టుపక్కల భారీగా పొగ అలుముకుంది. హోటల్‌కు భోజనం చేసేందుకు వెళ్లిన వారు క్షేమంగా బయటపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.