Nara Lokesh: మాటల్లేవ్…చేతలే..! శభాష్ లోకేష్..!

Nara Lokesh: వరద సహాయక చర్యల్లో లోకేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా..మంత్రి లోకేష్ నిరంతరం కష్టపడుతున్నారు. ముఖ్యంగా మొంథా తుపాను కారణంగా సంభవించిన వరదలు, నష్టానికి సంబంధించి అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ వరద బాధితులకు సహాయం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. రెండో రోజు వరుసగా ఆర్టీజీఎస్ కేంద్రంలో మంత్రి నారా లోకేష్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
తుఫాను తీవ్రత, వివిధ జిల్లాల్లో సంభవించిన నష్టం, సహాయక చర్యల పురోగతిపై లోకేష్ వివరాలు తెలుసుకున్నారు. యువమంత్రి తీసుకుంటున్న చొరవ, అలుపెరుగని కృషిపై ప్రభుత్వ పెద్దలతోపాటు పార్టీ క్యాడర్ , ప్రజలు శభాష్ లోకేష్ అంటున్నారు. తుఫాన్ వంటి సంక్షోభ సమయంలో ఆయన చూపిన పట్టుదల, అంకితభావం మరోసారి యువ నాయకత్వానికి నిదర్శనమైంది.
ఎప్పొడొచ్చామన్నది కాదు ముఖ్యం..ఆపదలో ఉన్నవారికి సాయం చేశామా లేదా అన్నదే ఇంపార్టెంట్. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ విషయంలో ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. మంత్రిగా అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు లోకేష్. మంత్రి లోకేష్ కృషితో రియల్ టైమ్ గవర్నెన్స్‌లో దేశంలోనే ఏపీ టాప్ ప్లేస్ లో నిలిచింది. ఇక ఇటీవలి వర్షాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కష్టాల్లో ఉన్న ప్రజల కోసం లోకేష్ వ్యక్తిగతంగా స్పందించడం, వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి పరిస్ధితులు తెలుసుకోవడం, అవసరమైన చర్యలను సూచించడం ఇది కేవలం రాజకీయ నాయకత్వం కాదు, రియల్ టైమ్ గవర్నెన్స్‌కు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ప్రజల కోసం రేయంబవళ్లూ మంత్రి లోకేష్ చేస్తున్న కృషిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
మొంథా తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతాలతో పాటు ఇతర అన్ని జిల్లాల్లో తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి. తుఫాను తీవ్రతపై ఏపీ మంత్రి నారా లోకేష్ అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో సమీక్ష నిర్వహించారు. వివిధ జిల్లాల్లో మొంథా తుఫాను తీవ్రత, ఇప్పటివరకు జరిగిన నష్టంపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. తుఫాను వల్ల కలిగిన నష్టంపై ప్రాథమిక అంచనాలు త్వరితగతిన రూపొందించాలని అధికారులను ఆదేశించారు మంత్రి లోకేష్.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై ఆరా తీశారు. ముంపు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి. క్షేత్రస్థాయిలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉండి బాధితులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
వర్షాల కారణంగా దెబ్బతిన్న గ్రామాల్లో, రహదారులు తెగిపోయిన ప్రాంతాల్లో, లోకేష్ రాత్రింబవళ్ళూ ఫీల్డ్‌లో ఉన్న అధికారులతో మాట్లాడుతూ “ప్రజలే ప్రాధాన్యం” అనే సందేశం ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి కోఆర్డినేటర్‌కు, స్థానిక టీమ్స్‌కు ఆయన ఇచ్చిన సూచన స్పష్టంగా ఉంది —“రిపోర్టులు కాదు, రియల్ హెల్ప్ కావాలి. ప్రజలు సేఫ్‌గా ఉన్నారా అన్నది ప్రతి గంటకోసారి తెలుసుకోండంటూ లోకేష్ సూచించారు. వర్షాలతో ఇళ్లలో ఇరుక్కుపోయిన కుటుంబాలకు ఆహారం, మందులు చేరేలా ప్రత్యేకంగా టీమ్‌లు ఏర్పాటు చేశారు.
డిజిటల్ మానిటరింగ్‌తో పాటు రిపోర్టింగ్ ద్వారా లోకేష్ వ్యవస్థను చురుకుగా నడిపించారు. ప్రజల కష్టసుఖాలు వినడమే కాదు, సమస్య పరిష్కారం వరకు ఫాలోఅప్ చేయడం — ఇది ఆయన శైలికి కొత్త ఉదాహరణగా నిలిచింది. రాత్రింబవళ్ళూ రోడ్లపై, రెస్క్యూ ఆపరేషన్ల మధ్యలో కనిపించిన లోకేష్‌ను స్థానికులు “మనవాడే వచ్చాడు” అని భావించారు. లోకేష్ ప్రజల కోసమే – ప్రజల్లోనే ఉన్న నాయకుడని టీడీపీ క్యాడర్ కూడా జేజేలు పలుకుతున్నారు. యువమంత్రి నారా లోకేష్ ప్రణాళిక, పట్టుదల, చొరవకు ప్రజల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటున్నారు.
మొంథా తుఫాన్ బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో అంతా తానై…అధికార యంత్రాంగాన్ని నడిపిస్తున్నారు మంత్రి నారా లోకేష్. తుఫాన్ సహాయకచర్యలపై నిరంతరం సమీక్షిస్తూ…అన్ని వ్యవస్థలనూ గాడిలో పెట్టేలా చర్యలుతీసుకుంటున్నారు. జిల్లాల వారీగా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఎక్కడ ఏం పరిస్థితి ఉందో తెలుసుకున్నారు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం సహాయకార్యక్రమాలు చేపట్టేలా ఎప్పటికప్పుడూ ఆదేశాలు ఇస్తున్నారు.
బాధితులకు మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తగ్గేలా అన్ని శాఖలు సమన్వయంగా పనిచేయాలని లోకేష్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉండి బాధితులకు సహాయక చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, రవాణా, త్రాగునీటి సేవలు త్వరగా సాధారణ స్థితికి తెచ్చే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. రాష్ట్రాన్ని మొంథా తుఫాను వణికిస్తున్న నేపథ్యంలో మంత్రి లోకేష్ తీసుకుంటున్న చొరవ , వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.



