తెలంగాణ
తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యలను సమర్థించిన కేటీఆర్

తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యలను సమర్థించించారు మాజీ మంత్రి కేటీఆర్. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దన్న తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యలకు ఆయన మద్దతు తెలిపారు. దేశ అవసరాలకు తగినట్లు కుటుంబ నియంత్రణను బాగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదని కేటీఆర్ అన్నారు.
దక్షిణాది రాష్ట్రాల పనితీరును పరిగణనలోకి తీసుకోకుండా పునర్విభజన చేయడం ప్రజాస్వామ్య, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. దేశ నిర్మాణంలో తెలంగాణ, దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్న కృషిని ఎవరూ విస్మరించలేదంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.