ఆంధ్ర ప్రదేశ్
కర్నూల్ జిల్లాలో మరో ప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన కర్ణాటక బస్సు

కర్నూల్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కర్ణాటక బస్సు స్టీరింగ్ విరిగి పొలాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ చాకచక్యంతో ప్రమాదం తప్పింది. బెంగళూరు నుండి మంత్రాలయం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం నుంచి బయటపడటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.



