ఆంధ్ర ప్రదేశ్
ఉదయం పెళ్లి..రాత్రి నవవధువు ఆత్మహత్య

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మణికంఠ కాలనీలో పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. ఉదయం పెళ్లి, మొదటి రాత్రి జరగాల్సి ఉండగా నవవధువు ఆత్మహత్య చేసుకోవడంతో బంధువులతో కళకళలాడిన ఆ ప్రాంతం చిన్నబోయింది. బాగేపల్లి గ్రామానికి చెందిన నరేంద్రతో సోమవారం వివాహం జరిగింది.
అదే రోజు రాత్రి గదిలోకి వెళ్లి ఉరి వేసుకుంది నవ వధువు హర్షిత. హర్షితకు 22 ఏళ్లు. కాళ్ల పారాణి ఆరకముందే ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. వధువుకు ఇష్టం లేని వివాహం చేశారా లేక ఇతర కారణాలా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.



