తెలంగాణ
నేడు రెండో రోజు ఐబొమ్మ రవి కస్టడీ విచారణ

నేడు రెండో రోజు ఐబొమ్మ రవిని కస్టడీకి తీసుకోనున్నారు పోలీసులు. టెక్నికల్ టీమ్‌ను రంగంలోకి దింపనున్నారు. నిన్న 6 గంటల పాటు రవిని విచారించారు. ఐబొమ్మ రవి బ్యాంక్ లావాదేవీలపై ఆరా తీశారు. రవి నెట్‌వర్క్, ఇంటర్నెట్ సోర్స్‌పై విచారణ జరిపారు. రవిపై ఫారెనర్స్ యాక్ట్ సెక్షన్ జోడించారు పోలీసులు. ఎన్ఆర్ఈ, క్రిప్టో కరెన్సీ, వ్యాలెట్స్, రవి బ్యాంక్ ఖాతాలపై విచారణ జరిపారు.



