అంతర్జాతీయం
చైనాపై మరోసారి అమెరికా టారిఫ్ పిడుగులు

చైనాపై అమెరికా మరోసారి టారిఫ్‌ల మోత మోగించింది. USకు అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంపై ట్రంప్ సీరియస్ అయ్యారు. యూఎస్ దిగుమతి చేసుకునే చైనా ఉత్పత్తులపై 100 శాతం సుంకాలు విధించారు.
చైనా అందరికీ శత్రువుగా మారుతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. అవసరం అయితే జిన్‌పింగ్‌తో భేటీ రద్దు చేసుకుంటానని ట్రంప్ స్పష్టం చేశారు. చైనాపై అదనపు సుంకాలను కూడా విధిస్తామని ట్రంప్ తెలిపారు.



